Skip to main content

Posts

Penimitii

నువ్ కడుపునా పడినాకే.. మీ అమ్మని గెలిసేసినాను అనుకున్నాడో ఏందో దాన్ని వంటింట్లో వదిలేసి.. వరండాలా పోయి.. ఊరిని గెలచటం మొదలెట్టినాడు.. నిద్దరిని ఇరాసేసి.. రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో.. సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి.. రా రా సగిలేటి డొంకల్లో పదిలంగా.. రా రా నలిగేటి నా మనసు గురుతొచ్చి.. రా రా గలబోటీ కూరొండి పిలిసినా.. రా రా పెనిమిటీ ఎన్ని నాల్లయైనదో.. నిను జూసి కళ్లారా ఎన్నెన్ని నాల్లయైనదో.. నిను జూసి కళ్లారా చిమ్మాటి చీకటీ.. కమ్మటి సంగటి ఎర్రగా కుంపటీ.. ఎచ్చగా దుప్పటీ కొమ్మలో సక్కటీ.. కోయిలే ఒక్కటీ కొమ్మలో సక్కటీ.. కోయిలే ఒక్కటీ గుండెనే గొంతుసేసి.. పాడతాంది రా రా పెనిమిటీ గుండెనే గొంతుసేసి.. పాడతాంది రా రా పెనిమిటీ పొలిమేర దాటి పోయావని.. పొలమారిపోయే నీ దానినీ కొడవలి లాంటి నిన్ను.. సంటి వాడనీ కొంగున దాసుకునే.. ఆలి మనసునీ సూసి సూడకా.. సులకన సేయకు నా తలరాతలో.. కలతలు రాయాకు తాళిబొట్టు తలుసుకొని.. తరలి తరలి రా రా పెనిమిటీ హే.. తాళిబొట్టు తలుసుకొని.. తరలి తరలి రా రా పెనిమిటీ నారగోస తాకే కామందువే.. నారగోస తాకే కామందువే.. నల్లపూసవైనా.. కంటికందవే కా
Recent posts

Yeda Poinado

ఏ కోనలో… కూలినాడో…. ఏ కొమ్మలో…. చేరినాడో… ఏ ఊరికో… ఏ వాడాకో… యాదబొయ్యడూ…. రమ్.. రుధిరం… సమరం… శిశిరం… రమ్.. మరణం… గెలవం… ఎవరం… యెడ పోయినాడో… యెడ పోయినాడో…. సింత లేని లోకం… సూడ బోయినాడో… చారడేసి గరుడపచ్చ… కళ్ళు వాల్చి.. గరికపచ్చ నెలపెనే… సీమ కక్ష వేటువేస్తే… రాలి పోయినాడో…. రమ్.. రుధిరం… సమరం… శిశిరం… రమ్.. మరణం… గెలవం… ఎవరం… కట్టెలే సుట్టాలు… కాడు మన తల్లీ తండ్రి అగ్గిదేవుడే మనకు ఆత్మ బంధువునందంగా కాలువ గట్టున నీ కళ్ళు కాలంగా… ఆకి శోకమూ… పొతిమే… ఆకి శోకమూ… పొతిమే… నరక స్వర్గ వని లాంటి విన్న మకులు ధాటి… ఈ… తిథియందు రా రాణి… తిథియందు రా రాణి… నట్టింట ఇస్త్తరులు నాణ్యముగా పరిపించి ఈ వాగు చెంతకు పోయేవు నీ వారు దుక్కా పోయేవు. మృత్యువు మూకుడు మూసినా ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని ఇంకని చెంపల పారేసోకం తూకం వేసేదెవరని కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు యెక్కడని ఊపిరాడని గుండెకు గాలిని కబడం ఇచ్చే దెవ్వరని చుక్కే లేనీ… నింగి.. ప్రశ్నించిందా… వంగి ఏ కోనలో… కూలినాడో…. ఏ కొమ్మలో…. చేరినాడో… రమ్.. రుధిరం… సమరం… శిశిరం… రమ్.. రుధిర